: ఉప్పల్ స్టేడియంలో కేసీఆర్ కు సన్మానంపై ఐసీసీ అభ్యంతరం!


భారత్, శ్రీలంక జట్ల మధ్య హైదరాబాదులో నేడు జరగనున్న వన్డే మ్యాచ్ కు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు హాజరుకానున్న సంగతి తెలిసిందే. ఆయనకు రెడ్ కార్పెట్ స్వాగతం పలికేందుకు హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్ సీఏ) నిర్ణయించింది. లాబీ నుంచి బౌండరీ లైన్ వరకు ఎర్ర తివాచీ పరుస్తున్నారు. మ్యాచ్ కు ముందు ఇరు జట్ల ఆటగాళ్లను కేసీఆర్ పరిచయం చేసుకుంటారు. ఈ సందర్భంగా మైదానంలో కేసీఆర్ ను సన్మానించనున్నారు. అయితే, దీనిపై ఐసీసీతో పాటు మ్యాచ్ ప్రసారకర్తలు అభ్యంతరం తెలిపినట్టు సమాచారం. ఈ వ్యవహారంపై హెచ్ సీఏ వర్గాలు స్పందిస్తూ, ఇందుకోసం అనుమతి తీసుకున్నట్టు తెలిపాయి.

  • Loading...

More Telugu News