: సూరత్ ఎయిర్ పోర్టులో పశువుల హల్ చల్


గురువారం రాత్రి సూరత్ ఎయిర్ పోర్టులో స్పైస్ జెట్ విమానాన్ని ఢీకొని ఓ దున్నపోతు మరణించడం తెలిసిందే. ఆ ఘటనపై ఓ వైపు ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు దర్యాప్తు జరుపుతుండగానే, రెండు ఆవులు విమానాశ్రయంలో తీరిగ్గా గడ్డి మేస్తూ దర్శనమిచ్చాయి. ఈ ఆవులు విమానాశ్రయం మెయిన్ గేటు నుంచే లోపలకి ప్రవేశించాయట. దీనిపై సెక్యూరిటీ గార్డు మాట్లాడుతూ, తనకు ఏ ఆవూ కనిపించలేదని చెప్పాడు. అయితే, ఈ విమానాశ్రయంలో పశువులు ప్రవేశించడం సాధారణమని ఓ వ్యక్తి తెలిపాడు. గడ్డిమేసి వెళ్లిపోతుంటాయని, వాటిని ఎవరూ బయటికి తోలరని చెప్పాడు. కాగా, ఈ వ్యవహారంపై వ్యాఖ్యానించేందుకు సూరత్ ఎయిర్ పోర్టు డైరక్టర్ ఎస్.డి.శర్మ నిరాకరించారు.

  • Loading...

More Telugu News