: నల్లధనం వ్యవహారంలో కేంద్రప్రభుత్వాన్ని మరోమారు తప్పుబట్టిన సుబ్రహ్మణ్యస్వామి


విదేశీ బ్యాంకుల్లో నల్లధనాన్ని దాచుకున్న ఖాతాదారుల పేర్లను కేంద్ర ప్రభుత్వం వెల్లడించకపోవడాన్ని ఆ పార్టీ నేత సుబ్రహ్మణ్యస్వామి తప్పుబట్టారు. ఇతర దేశాలతో కుదుర్చుకున్న 'ద్వంద్వ పన్ను నిరోధక ఒప్పందం' నేపథ్యంలో, ఖాతాదారుల పేర్లను వెల్లడించలేకపోతున్నామంటూ కేంద్ర ప్రభుత్వం చేసిన వ్యాఖ్యల్ని ఆయన ఖండించారు. ఈ కారణం సమర్థనీయం కాదని అన్నారు. సమాచారాన్ని గోప్యంగా ఉంచాలని ఒప్పందంలోని ఒక నిబంధన చెబుతున్నప్పటికీ... ఆ అవరోధాన్ని సులభంగా అధిగమించవచ్చని చెప్పారు.

  • Loading...

More Telugu News