: ఎర్రబెల్లి, రేవంత్ లు పుచ్చిపోయిన వంకాయలు: టీఆర్ఎస్
తెలుగుదేశం పార్టీలో ఎర్రబెల్లి దయాకర్ రావు, రేవంత్ రెడ్డిలు పుచ్చిపోయిన వంకాయల లాంటివారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తీవ్ర విమర్శలు చేశారు. పచ్చపార్టీలోని మంచి వంకాయలనే కేసీఆర్ తీసుకున్నారని... పుచ్చిపోయిన వంకాయలు ఇప్పుడు కేసీఆర్ ఇంటి చుట్టూ తిరుగుతున్నాయని ఎద్దేవా చేశారు. త్వరలోనే తెలంగాణ ప్రజలు వీరికి బుద్ధి చెబుతారని అన్నారు.