: 12 నుంచి చంద్రబాబు సింగపూర్ పర్యటన
ఈ నెల 12, 13, 14 తేదీల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ లో పర్యటించనున్నారు. ఆయన వెంట 15 మందితో కూడిన బృందం కూడా వెళుతోంది. పర్యటన సందర్భంగా, రాజధాని నిర్మాణానికి సంబంధించి నిర్మాణ రంగ సంస్థలతో చంద్రబాబు చర్చించనున్నారు. అంతేకాకుండా స్మార్ట్ సిటీల నిర్మాణంలో సింగపూర్ సహకారాన్ని కోరనున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించనున్నారు.