: 17 మంది ఉగ్రవాదులను కాల్చి చంపిన పాక్ బలగాలు
పాకిస్థాన్ లోని వాయవ్య ప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. స్పిన్ ఖమర్ ప్రాంతంలో సైనికదళాలపై ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. దీంతో, సైన్యం ఎదురు కాల్పులు జరిపింది. ఈ ఘటనలో 17 మంది ఉగ్రవాదులు మరణించారని సైనిక వర్గాలు తెలిపాయి.