: రాజధానిపై చంద్రబాబు ఏకపక్ష నిర్ణయాలు: సి.రామచంద్రయ్య
నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఏకపక్ష నిర్ణయాలతో ముందుకెళుతున్నారని మాజీ మంత్రి సి.రామచంద్రయ్య ఆరోపించారు. రాజధాని నిర్మాణం, రైతుల నుంచి భూముల సేకరణ తదితర విషయాలపై చంద్రబాబు ప్రభుత్వం ప్రతిపక్షాలకు మాటమాత్రంగానైనా చెప్పకుండా ముందుకెళుతోందని ఆయన ఆరోపించారు. శనివారం గుంటూరు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడిన సందర్భంగా ఈ మేరకు వ్యాఖ్యానించారు.