: భూముల అప్పగింతలో రైతులకు అపోహలు అవసరం లేదు: చంద్రబాబు


నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి అవసరమైన భూములను ప్రభుత్వానికి అప్పగించే విషయంలో రైతులు ఎలాంటి అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు భరోసా ఇచ్చారు. శనివారం రాజధాని భూ సేకరణ కమిటీ సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భూములను నమ్ముకున్న రైతులకు న్యాయం చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. భూములను అమ్ముకునేందుకు యత్నిస్తున్న రైతులను ప్రభుత్వం అడ్డుకుంటోందన్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. మరింత కాలం భూములను నిలుపుకుంటే, మంచి ధరలు వస్తాయని మాత్రమే రైతులకు చెబుతున్నామని ఆయన తెలిపారు. రాజధాని నిర్మాణం కోసం సేకరిస్తున్న భూముల విషయంలో రైతులందిరినీ సమాన దృష్టితోనే చూస్తామని, ఏ ఒక్క రైతు కూడా నష్టపోని విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News