: ఈసారి పుస్తకంతో రికార్డు సృష్టించిన సచిన్... సేల్స్ అదుర్స్!
ఇప్పటిదాకా బ్యాటుతో రికార్డులు సృష్టించిన సచిన్ టెండూల్కర్, ఇప్పుడు తన ఆత్మకథ 'ప్లేయింగ్ ఇట్ మై వే' పుస్తకంతోనూ రికార్డులు సృష్టిస్తున్నాడు. గురువారం విడుదలైన ఈ పుస్తకం ఫిక్షన్, నాన్ ఫిక్షన్ కేటగిరీల్లో అన్ని రికార్డులను తిరగరాస్తోందని ప్రచురణ కర్తలు పేర్కొన్నారు. విడుదలకు ముందే ఈ పుస్తకానికి 1,50,000 కాపీల మేర ఆర్డర్లు వచ్చాయట. ఈ క్రమంలో సచిన్ పుస్తకం 'యాపిల్' వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ జీవితచరిత్ర (1,30,000 కాపీలు) రికార్డును అధిగమించడం విశేషం. సచిన్ ఆత్మకథను ప్రచురించిన హచిటే ఇండియా సంస్థ ఎండీ థామస్ అబ్రహాం మాట్లాడుతూ, సచిన్ పుస్తకం కూడా అతని బ్యాటులానే రికార్డులు నెలకొల్పడం తమకేమీ ఆశ్చర్యం కలిగించలేదని అన్నారు. తాజా రికార్డు నేపథ్యంలో, పుస్తక రంగంలో సచిన్ అరంగేట్రంలోనే వెయ్యి సెంచరీలు కొట్టినట్టని అభివర్ణించారు.