: వృద్ధ దంపతుల హత్యకేసును ఛేదించిన హైదరాబాద్ పోలీసులు


హైదరాబాదులో శాంతిభద్రతల కోసం కేసీఆర్ సర్కారు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా క్రైమ్ రేటు మాత్రం తగ్గడంలేదు. గురువారం మధ్యాహ్నం హైదరాబాదులోని హైదర్షాకోట్ సాయిహర్ష కాలనీలో వృద్ధ దంపతులు హత్యకు గురవడం సంచలనం కలిగించింది. మృతులు రిటైర్ట్ ఉద్యోగులు. వీరి హత్య కేసును పోలీసులు త్వరితగతిన ఛేదించారు. ఇంతకుముందు వారి ఇంట్లో పనిచేసిన వ్యక్తి, ఓ ఆటో డ్రైవర్ తో కలసి ఘాతుకానికి పాల్పడ్డాడు. వారివద్ద బంగారం, నగదు పెద్ద మొత్తంలో ఉంటుందనే హత్యలకు పాల్పడ్డట్టు నిందితులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజి ఆధారంగా హంతకులను గుర్తించి, అరెస్టు చేశారు. ప్రస్తుతం వారిని రిమాండ్ కు తరలించారు.

  • Loading...

More Telugu News