: 'హుదూద్' ప్రభావిత జిల్లాల్లో వ్యవసాయ రుణాల రీషెడ్యూల్
ఏపీలో హుదూద్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వ్యవసాయ రుణాల రీషెడ్యూల్ కు బ్యాంకర్ల కమిటీ ఆమోదం తెలిపింది. హైదరాబాదులో ప్రత్యేకంగా సమావేశమైన బ్యాంకర్ల కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని అన్ని మండలాల్లో, తూర్పు గోదావరి జిల్లాలోని ఐదు మండలాల్లో రుణాలను రీషెడ్యూల్ చేస్తారు. రుణాలను 5-7 సంవత్సరాల్లో చెల్లించవచ్చని బ్యాంకర్ల కమిటీ పేర్కొంది.