: జయపూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్న మోదీ
వారణాసి లోక్ సభ నియోజకవర్గంలో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ, స్థానిక జయపూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. అక్కడ ఆచరణలో ఉన్న భ్రూణహత్యలకు ముగింపు పలకడమే లక్ష్యమని చెప్పారు. కాగా, సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వాలకు కొంత సమయం ఇవ్వాలని గ్రామస్థులకు ఆయన విజ్ఞప్తి చేశారు. అయితే, గత అరవై ఏళ్లుగా గ్రామాలు అభివృద్ధి చెందని పరిస్థితిపై మోదీ విచారం వ్యక్తం చేశారు. అటు ఢిల్లీ, లక్నోలలో గ్రామాల కోసం రూపొందించిన విధానాలపైన ప్రధాని ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. "గత 60 ఏళ్లలో 'పెద్ద వ్యక్తులు' పెద్ద వాగ్దానాలే చేశారు. అయినా వాటి అమలు సాధ్యం కాలేదు. కానీ, నేను చాలా చిన్న వ్యక్తిని. నా చిన్న మాటల ద్వారా పెద్ద పనులు చేస్తా" అని మోదీ పేర్కొన్నారు.