: మైక్ అందుకుని భక్తి గీతాలు పాడిన ఆనం వివేకా
తానెక్కడుంటే అక్కడ ఉత్సాహం ఉరకలెత్తించే నేత ఆనం వివేకానందరెడ్డి. కుర్రాళ్ల మాదిరే కలర్ ఫుల్ కళ్లద్దాలు పెట్టుకున్నా, అతివలా చీర కట్టుకుని పోజులిచ్చినా, సెలూన్ ఓపెనింగ్ కు వెళ్లి కత్తెర పట్టి చకచకలాడించినా అది వివేకాకే చెల్లు అనేలా వ్యవహరిస్తారు. తాజాగా, ఆయన మైక్ అందుకుని భక్తి గీతాలు ఆలపించి తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించారు. నెల్లూరులోని మూలపేటలో ఉన్న శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవస్థానం ఇందుకు వేదికగా నిలిచింది. స్వామి వారి దర్శనం కోసం ఆలయానికి వచ్చిన ఈ మాజీ ఎమ్మెల్యే అక్కడి భక్తుల భజనలతో ఉత్తేజితులయ్యారు. వెంటనే మైక్ అందుకుని తనకు తెలిసిన కొన్ని గీతాలు ఆలపించి అందరినీ ఆశ్చర్యపరిచారు.