: తెలంగాణ శాసనసభ, మండలి సోమవారానికి వాయిదా


ఈరోజు ఆద్యంతం ఆందోళనలు, నిరసనలు, వాయిదాలు, సస్పెన్షన్లతో అట్టుడికిన తెలంగాణ అసెంబ్లీ సోమవారానికి వాయిదా పడింది. టీ విరామ సమయంలో స్పీకర్ మధుసూదనాచారి తన ఛాంబర్ లో అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో సమావేశం నిర్వహించారు. సోమవారం నాడు బీఏసీ సమావేశం నిర్వహించాలని ఈ భేటీలో నిర్ణయించారు. వాయిదా తీర్మానాల అంశాన్ని సోమవారం నాటి బీఏసీలో ఖరారు చేస్తారు. అనంతరం అసెంబ్లీని సోమవారానికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. మరోవైపు, శాసనసభ బాటలోనే మండలి కూడా సోమవారానికి వాయిదా పడింది.

  • Loading...

More Telugu News