: రన్ వేపై దున్నపోతును ఢీకొట్టిన విమానం


టేకాఫ్ అవుతున్న సమయంలో ఓ స్పైస్ జెట్ విమానం రన్ వేపైకి అకస్మాత్తుగా వచ్చిన దున్నపోతును ఢీకొట్టింది. వెంటనే రన్ వే అధికారులు అప్రమత్తమవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఆ సమయంలో విమానంలో ఉన్న 140 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. గుజరాత్ లోని సూరత్ విమానాశ్రయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అటు విమానం ఇంజను భాగం దెబ్బతినగా, దున్నపోతు చనిపోయింది. విమానాశ్రయం రన్ వేపైకి దున్నపోతు రావడాన్ని తీవ్రంగా పరిగణించిన విమానయాన శాఖ ఘటనపై విచారణకు ఆదేశించింది. దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో భద్రతపైన సమీక్ష చేయాలని చెప్పింది. సూరత్ విమానాశ్రయానికి పక్కనే పశువులు తిరిగే ఖాళీ ప్రదేశాలు ఉన్నాయి. ఈ క్రమంలో సరిహద్దుగా ఉన్న గోడ ప్రస్తుతం రిపేర్ లో ఉండటంతో దున్నపోతు రన్ వే వైపుకు వచ్చిందని అక్కడి అధికారులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News