: ఢిల్లీలో ఆప్ నిలువరింతకు ముస్లిం వాడలకు బీజేపీ!
రానున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీని నిలువరించేందుకు అందుబాటులోని అన్ని మార్గాలను బీజేపీ పరిశీలిస్తోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా కొనసాగుతున్న ముస్లిం ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పథక రచన చేస్తోంది. ముస్లింల ప్రాబల్యం అధికంగా ఉన్న త్రిలోక్ పురి, బవానా, ఓక్లా తదితర ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. అంతేకాక, సదరు కార్యక్రమాల్లో తమ అభివృద్ధి మంత్రాన్ని ముస్లింలకు వివరించాలని నిర్ణయించింది. ఈ తరహా పథకంతో ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్లు అటు కాంగ్రెస్ ఓటు బ్యాంకును చేజిక్కించుకోవడంతో పాటు ఢిల్లీలో పెను సవాల్ గా మారిన అరవింద్ కేజ్రీవాల్ ను మట్టి కరిపించవచ్చని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.