: సభ్యుల సస్పెన్షన్ చాలా బాధాకరం... వెంటనే విత్ డ్రా చేసుకోండి: జానారెడ్డి


శాసనసభ తొలి బడ్జెట్ సమావేశాలు రెండో రోజునే సభనుంచి సభ్యులను సస్పెండ్ చేయడం చాలా బాధాకరమని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయాలని హరీష్ కోరడం... కనీసం ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తమరు సస్పెండ్ చేయడం చాలా ఆవేదన కలిగిస్తోందని స్పీకర్ ను ఉద్దేశించి జానారెడ్డి వ్యాఖ్యానించారు. తొలి సమావేశాల మర్యాదను కాపాడాలని... సస్పెన్షన్ వేటును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. టీడీపీతో కాంగ్రెస్ జతకట్టిందని మంత్రి ఈటెల చేసిన వ్యాఖ్యలను కూడా జానారెడ్డి ఖండించారు. కాంగ్రెస్ ఒక జాతీయ పార్టీ అని... టీడీపీతో కాంగ్రెస్ జతకట్టదని, గతంలో టీడీపీతో జతకట్టింది టీఆర్ఎస్ పార్టీనే అని గుర్తు చేశారు. సభలో విపక్షాలన్నీ డ్రామాలాడుతున్నాయని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై మాట్లాడుతూ, నిజంగా డ్రామాలాడుతున్నది ఎంఐఎం అని మండిపడ్డారు. టీఆర్ఎస్ తో లాలూచీ పడి ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. డ్రామాలు అన్న మాటను అక్బర్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News