: హెచ్ఎస్ బీసీ ‘నల్ల’ ఖాతాల్లో సగానికి సగం ఖాళీనేనట!
నల్లధనం వ్యవహారం రోజుకో కొత్త విషయాన్ని మోసుకొస్తోంది. శుక్రవారం తాజాగా మరో ఆసక్తికర అంశం వెలుగు చూసింది. నల్లధనానికి సంబంధించి హాంకాంగ్ అండ్ షాంగై బ్యాంకింగ్ కార్పోరేషన్ (హెచ్ఎస్ బీసీ)లో దాదాపు 628 బ్యాంకు ఖాతాలున్నట్లు నల్లధనంపై ఏర్పాటైన సిట్ తేల్చింది. అయితే వీటిలోని 289 ఖాతాల్లో చిల్లిగవ్వ కూడా నిల్వ లేదట. అంతేకాక, దాదాపు వందమందికి పైగా నల్ల కుబేరుల పేర్లు పునరావృతమయ్యాయట. తాజా వాస్తవాలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో హెచ్ఎస్ బీసీ నల్ల ఖాతాలకు సంబంధించి 300 ఖాతాలపై దర్యాప్తు కొనసాగించేందుకు అవకాశాలున్నట్లు సిట్ నిగ్గుతేల్చింది.