: కాశ్మీర్ లోని ప్రాంతీయ పార్టీలు ప్రజల సెంటిమెంటును వాడుకుంటున్నాయి: కాంగ్రెస్


జమ్మూకాశ్మీర్ లోని ప్రాంతీయ పార్టీలు స్థానిక ప్రజల సెంటిమెంటును వాడుకుని ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నాయని కాంగ్రెస్ నేత అబ్దుల్ గని వకిల్ ఆరోపించారు. స్వయం ప్రతిపత్తి, స్వయం పాలన అంటూ ఓటర్లను బుట్టలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ చెబుతున్నట్టు కాశ్మీర్ లో స్వయం పాలన సాధ్యమేనా? అని ఆయన ప్రశ్నించారు. ప్రాంతీయ పార్టీల మాయలో పడరాదని... చిత్తశుద్ధి కలిగిన కాంగ్రెస్ కే ఓటు వేయాలని కోరారు.

  • Loading...

More Telugu News