: మోదీ పాలన అద్భుతం... ఆయన నుంచి ఎంతో నేర్చుకోవాలి: చంద్రబాబు


ప్రధాని మోదీ పాలన చాలా అద్భుతంగా ఉందని... ఆయన నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న 'ఎకనమిక్ సమ్మిట్'లో ఆయన ప్రసంగిస్తూ ఈ విధంగా స్పందించారు. రాష్ట్రంలో సౌర విద్యుత్ ను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని... పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేక మిషన్ ను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజల అంచనాలకు అనుగుణంగా పనిచేస్తామని... ఎలాంటి కష్టాలు లేకుండా చేస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News