: బీజేపీ ఒత్తిడి వల్లే తెలంగాణకు ఛత్తీస్ గఢ్ విద్యుత్: కిషన్ రెడ్డి
విద్యుత్ సరఫరా కోసం ఛత్తీస్ గఢ్ రాష్ట్రంతో ఒప్పందం చేసుకున్నామని టీఎస్ ప్రభుత్వం చెప్పుకుంటోందని... వాస్తవంగా చెప్పాలంటే, బీజేపీ నేతల ఒత్తిడి వల్లే ఛత్తీస్ గఢ్ కరెంట్ రాబోతోందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. కరెంటు ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నా... తీసుకోవడానికి కేసీఆర్ సిద్ధంగా లేరని మండిపడ్డారు. గొప్ప బడ్జెట్ ను ప్రవేశపెట్టామని కేసీఆర్ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని... బడ్జెట్లో రూ. 43 వేల కోట్లు కేంద్ర ప్రభుత్వానివే అని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నిధులు పొందుతున్న కేసీఆర్... కేంద్రాన్ని విమర్శించడం ఏమిటని ప్రశ్నించారు.