: ఇజ్రాయెల్ పర్యటనలో రాజ్ నాథ్ సింగ్


కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈరోజు నుంచి ఇజ్రాయెల్ పర్యటనలో బిజీగా గడపనున్నారు. గతరాత్రి అక్కడికి చేరుకున్న ఆయన, ఈరోజు ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో సమావేశమవుతారు. ద్వైపాక్షిక అంశాలు సహా భద్రతా సంబంధాల బలోపేతం, తీవ్రవాదంపై పోరు తదితర అంశాలపై రాజ్ నాథ్ కీలక చర్చలు జరపనున్నారు. వాస్తవానికి మంత్రి నిన్న (బుధవారం) ఉదయమే ఇజ్రాయెల్ చేరాల్సి ఉండగా ప్రతికూల వాతావరణం కారణంగా మొనాకో నుంచి వెళ్లాల్సిన విమానం రద్దయింది. దాంతో, ఆలస్యంగా, ఆ దేశ కాలమానం ప్రకారం రాత్రి పది గంటలకు చేరుకున్నారు. హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఆయన తొలి విదేశీ పర్యటన ఇదే. 2000 జూన్ లో అప్పటి భారత హోంమంత్రి ఎల్ కే అద్వాని ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లారు. ఆ తర్వాత ఓ భారత హోం మంత్రి ఇజ్రాయెల్ వెళ్లడం ఇదే ప్రథమం. అటు, ఆ దేశ సీనియర్ ప్రభుత్వ అధికారి మాట్లాడుతూ, "భారత్ మాకు ప్రధాన మిత్రదేశం. హోంమంత్రి పర్యటన చాలా ముఖ్యమైనదిగా భావిస్తాము. ఇరు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం చేసే విధంగా ఫలప్రదమైన చర్చలు జరుగుతాయని మేము అనుకుంటున్నాం" అని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News