: ఇక భారత్ లోనూ 'బర్గర్ కింగ్' రుచులు
అమెరికా తదితర పాశ్చాత్య దేశాల్లో బర్గర్లను ఎక్కువగా తింటుంటారు. వాటిలో ఎన్నో వెరైటీలు! చీజ్ బర్గర్లు, వెజ్ బర్గర్లు, చికెన్ బర్గర్లు... ఇలా నోరూరించే రుచుల్లో లభ్యమవుతాయి. అమెరికాలో ఇలాంటి బర్గర్ల తయారీలో 'బర్గర్ కింగ్' చెయిన్ రెస్టారెంట్లు పేరుగాంచాయి. ఇప్పుడు ఆ 'బర్గర్ కింగ్' భారత్ లో ప్రవేశిస్తోంది. నవంబర్ 9న ఢిల్లీలో తన రెస్టారెంటును ప్రారంభిస్తోంది. రాజధానిలోని సెలెక్ట్ సిటీ వాక్ మాల్ లో ఈ రెస్టారెంటును ఏర్పాటు చేస్తున్నారు. ఈ-కామర్స్ వెబ్ సైట్ ఈ-బే ద్వారా ఆర్డర్లను బుక్ చేసుకోవాలని 'బర్గర్ కింగ్' తెలిపింది. భారత సంస్కృతి, సంప్రదాయాలను దృష్టిలో పెట్టుకుని తమ మెనూలో బీఫ్ (పశు మాంసం) ఉత్పత్తులకు చోటివ్వలేదని 'బర్గర్ కింగ్' పేర్కొంది.