: ఫోర్బ్స్ ఇండియా రాక్ స్టార్ ... నరేంద్ర మోదీ!
భారత ప్రధాని నరేంద్ర మోదీ మరో ఘనతను సాధించారు. 'ఫోర్బ్స్' విడుదల చేసిన శక్తిమంతుల జాబితాలో మోదీకి చోటు దక్కింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అగ్రస్థానంలో నిలిచిన ఈ జాబితాలో మోదీ 15వ స్థానం దక్కించుకున్నారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ దఫా రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు. ఈ జాబితాతో ఈ ఏడాదే కొత్తగా చోటు దక్కించుకున్న మోదీని 'ఇండియా రాక్ స్టార్' గా 'ఫోర్బ్స్' అభివర్ణించింది. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతులుగా పేర్కొంటూ 72 మందితో విడుదల చేసిన ఈ జాబితాలో భారత పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ 36వ స్థానంలో, 'ఉక్కు' దిగ్గజం లక్ష్మీ మిట్టల్ 57 వ స్థానంలో నిలిచారు. ఇక, ప్రపంచ సాఫ్ట్ వేర్ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ పగ్గాలు చేపట్టిన తెలుగు తేజం సత్య నాదెళ్ల ఈ జాబితాలో 64వ స్థానాన్ని దక్కించుకున్నారు.