: ఏపీలో 5.82 లక్షల మంది రైతులు రుణ మాఫీకి అనర్హులు


ఆంధ్రప్రదేశ్ లో రైతు రుణ మాఫీ రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. తాజాగా, రాష్ట్రంలో రుణ మాఫీకి 49 లక్షల మంది రైతులు మాత్రమే అర్హత సాధించారు. మరో 5.82 లక్షల మంది రైతులు రుణ మాఫీకి అర్హత సాధించలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. వీరంతా రుణ మాఫీకి సంబంధించిన అర్హతలను బ్యాంకులకు సమర్పించలేదని ఆ వర్గాలు వెల్లడిస్తున్నాయి. బ్యాంకులకు వివరాల సమర్పణలో నిర్లక్ష్యం వహించిన వీరు తొలి దశలోనే అనర్హులుగా తేలారు. రుణ మాఫీకి సంబంధించి రాష్ట్రంలో మొత్తం 80 లక్షల ఖాతాలు తేలగా, వివరాలు లేని కారణంగా 5.82 లక్షల ఖాతాలను తిరస్కరించారు. మరో 15 లక్షల మంది రైతులు తమ ఆధార్ నెంబర్లను బ్యాంకు ఖాతాలకు జత చేసుకోలేదు. వీరి అర్హతలకు సంబంధించి ప్రత్యేకంగా సర్వే జరగనుంది. మరో 2.5 లక్షల మంది రైతులకు రేషన్ కార్డులున్నా, ఆధార్ కార్డులు లేవు. దీంతో, వీరి వివరాలనూ ప్రభుత్వం సర్వేలో సేకరించనుంది. ఇదిలా ఉంటే, అర్హత సాధించిన బ్యాంకు ఖాతాల్లో బహుళ ఖాతాలు ఎన్ని ఉన్నాయన్న అంశాన్ని తేల్చేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఈ కసరత్తుల నేపథ్యంలో, రుణ మాఫీకి అర్హత సాధించిన రైతుల జాబితా విడుదల మరో రెండు, మూడు రోజులు ఆలస్యం కానుందని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి.

  • Loading...

More Telugu News