: నేడు కార్తీక పౌర్ణమి... భక్తులతో పోటెత్తిన శివాలయాలు!
కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని గురువారం రాష్ట్రంలోని శివాలయాలు భక్తులతో పోటెత్తాయి. సూర్యోదయానికి ముందే పుణ్య నదుల్లో స్నానమాచరించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. శివాలయాలున్న చోట ఈ రద్దీ మరింత ఎక్కువగా ఉంది. విజయవాడలోని కృష్ణా బ్యారేజీ భక్తులతో కిటకిటలాడుతోంది. భీమవరం సోమేశ్వరస్వామి ఆలయం, శ్రీశైలంలోని భ్రమరాంభ మల్లికార్జునస్వామి ఆలయాలకు రికార్డు స్థాయిలో భక్తులు పోటెత్తారు.