: ఛాపెల్ కెప్టెన్సీ ప్రతిపాదన చేసినప్పుడు నా భార్య పక్కనే ఉంది: సచిన్


ద్రవిడ్ ను తప్పించి గ్రెగ్ చాపెల్ తనకు కెప్టెన్సీ ఇస్తానన్నప్పుడు తన భార్య అంజలి పక్కనే ఉందని క్రికెట్ గ్రేట్ సచిన్ తెలిపాడు. ముంబైలో 'ప్లేయింగ్ ఇట్ మై వే' పుస్తకావిష్కరణ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ, తన ఆత్మకథ రాసేందుకు మూడేళ్లు పట్టిందని అన్నాడు. కెరీర్ ఆసాంతం అన్న అజిత్ అనుక్షణం అండగా నిలిచాడని సచిన్ పేర్కొన్నాడు. క్రికెటర్ భార్యగా ఉండడం అంత తేలికైన విషయం కాదని సచిన్ తెలిపాడు. తొలికాపీని తన తల్లికి అందించిన సచిన్, రెండో కాపీని తన చిన్ననాటి కోచ్ రమాకాంత్ అచ్రేకర్ కు అందజేశాడు.

  • Loading...

More Telugu News