: ఆడపిల్ల పుట్టిందని కరవైన భర్త ఆదరణ...భార్య ఆందోళన
తిరుమలలోని భవానీ నగర్ లో ఆడపిల్ల పుట్టిందనే కారణంతో వివాహిత నిరాదరణకు గురైంది. పాప పుట్టి 11 నెలలు అవుతున్నా భర్త పట్టించుకోకపోవడంతో ఆమె తిరుపతి పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఏసీపీ వారికి కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. కౌన్సిలింగ్ ఇచ్చి పోలీసులు దంపతులిద్దర్నీ ఇంటికి పంపడంతో, తాను భార్యను, కుమార్తెను సక్రమంగా చూసుకుంటానని చెప్పిన భర్త, ఆమెను ఇంటి బయట వదిలేసి వెళ్లిపోయాడు...అతని వెంటపడలేని ఆమె తాళం వేసిన అత్తింటి ముందు ఆందోళన చేపట్టింది. కాగా, ఆమె అత్త బయట తాళం వేసుకుని అదే ఇంట్లో ఉండడం విశేషం.