: ఎంఐఎం పార్టీని బ్యాన్ చేయాలంటున్న షిండే తనయ


ఎంఐఎం అంటే ప్రధానంగా హైదరాబాదు పాతబస్తీలో బాగా పట్టున్న పార్టీ అనే అంటారు. ఇప్పుడా పార్టీ ఇతర రాష్ట్రాల్లోనూ తన ప్రాబల్యం పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. అందుకే, ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తన అభ్యర్థులను బరిలో నిలిపింది. రెండు స్థానాల్లో విజయం సాధించింది కూడా. షోలాపూర్ సిటీ సెంట్రల్ స్థానంలో తౌఫిక్ షేక్ ను పోటీకి దింపిన ఎంఐఎంకు అక్కడ నిరాశ తప్పలేదు. తౌఫిక్ పై కేంద్ర మాజీ హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే కుమార్తె ప్రణీతి ఘనవిజయం సాధించారు. తాజాగా, ప్రణీతి మాట్లాడుతూ, ఎంఐఎం పార్టీపై నిషేధం విధించాలంటున్నారు. ఎంఐఎం దేశద్రోహానికి పాల్పడే పార్టీ అని ఆరోపించారు. దేశ ప్రయోజనాలకు ఆ పార్టీ వ్యతిరేకమని అన్నారు. అందుకే, ఆ పార్టీని నిషేధించాలని గట్టిగా పోరాడుతున్నానని తెలిపారు. సిద్ధాంతపరంగా ఎంఐఎం భారత్ కు వ్యతిరేకమని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News