: ఢిల్లీ అసెంబ్లీ రద్దుకు రాష్ట్రపతి ఆమోదం... త్వరలోనే ఎన్నికల షెడ్యూల్
ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేసేందుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోద ముద్ర వేశారు. దాంతో, త్వరలో రాజధానిలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించనుంది. ఈ క్రమంలో మూడు స్థానాల్లో ఉప ఎన్నికలు జరపాలన్న ఆలోచననను ఈసీ ఉపసంహరించుకుంది. లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ నివేదిక నేపథ్యంలో రాష్ట్రపతి సుముఖత తెలుపుతూ కేంద్ర కేబినెట్ కు పంపారు. అటు కేబినెట్ కూడా నిన్న అసెంబ్లీ రద్దుకు సమ్మతి తెలిపిన సంగతి తెలిసిందే.