: ఎవరితో మాట్లాడాలో పాక్ నిర్ణయించుకోవాలి: అరుణ్ జైట్లీ


భారత్, పాకిస్థాన్ ల చర్చలపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ తాజాగా స్పందించారు. ప్రభుత్వంతో చర్చించాలనుకుంటున్నారా? లేక వేర్పాటువాదులతో మాట్లాడాలనుకుంటున్నారా? అనేది పాక్ నిర్ణయించుకోవాలని స్పష్టం చేశారు. "ముందు ఎవరితో మాట్లాడాలో పాకిస్తాన్ నిర్ణయం తీసుకోవాలి. భారత్ తోనా? లేక విభజన వాదులతోనా? అన్నది తేల్చుకోవాలి. సరిహద్దు వద్ద ప్రతికూల వాతావరణాన్ని సృష్టించడంవల్ల చర్చలు కొనసాగించడానికి అనుకూలంగా లేము. అయితే, పాక్ తో చర్చలు జరిపేందుకు భారత ప్రభుత్వం మళ్ళీ తన సమ్మతిని చూపుతోంది. ఈ మేరకు వారికి క్లియర్ మెసేజ్ పంపాము" అని జైట్లీ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News