: మరోమారు తగ్గనున్న డీజిల్, పెట్రోల్ ధరలు!


అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు మరింతగా క్షీణించిన నేపథ్యంలో దేశంలో మరోమారు డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గనున్నాయి. అమెరికాకు విక్రయిస్తున్న ముడి చమురు ధరల్లో బ్యారెల్ రేటును నాలుగేళ్ల కనిష్టం 80 డాలర్లకు తగ్గించిన సౌదీ అరేబియా చర్యతో ఈ దఫా డీజిల్, పెట్రోల్ రేట్లు తగ్గనున్నట్లు చమురు రంగ నిపుణులు చెబుతున్నారు. ఈ నెల 1న పెట్రోల్ తో పాటు డీజిల్ కూడా లీటరుకు రూ.2 తగ్గిన విషయం తెలిసిందే. మొన్నటిదాకా డీజిల్ ధరలపై ప్రభుత్వ నియంత్రణ తొలగిన నేపథ్యంలో ఇకపై పెట్రోల్ ధరలు తగ్గినప్పుడల్లా డీజిల్ ధరలు కూడా తగ్గనున్నాయి. తాజాగా ఎంత మేర ధర తగ్గుతుందన్న విషయం ఇంకా తెలియరాలేదు.

  • Loading...

More Telugu News