: ఎన్నికల్లో పోటీ చేయట్లేదు: ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్


గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ చేతిలో చవిచూసిన ఘోర పరాభవం నుంచి ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ ఇంకా తేరుకోనట్లున్నారు. మూడు దఫాలుగా వరుసగా పదిహేనేళ్లు ఢిల్లీ సీఎంగా పాలన సాగించిన ఆమె అసలు ఎన్నికల పేరెత్తితేనే హడలిపోతున్నారు. షెడ్యూల్ ఖారారు కాకున్నా, వచ్చే ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగడం ఖాయమే. అయితే ఎన్నికల షెడ్యూలే ఖరారు కాలేదు, అప్పుడే తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని షీలా దీక్షిత్ ప్రకటించారు. బుధవారం ఓ ప్రైవేట్ టీవీ ఛానెల్ కిచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే ఢిల్లీలో నెలకొన్న ప్రతిష్టంభనకు మాత్రం, కేజ్రీవాలే కారణమని ఆరోపించారు. తనను రాజకీయంగా మట్టి కరిపించిన కేజ్రవాల్ పై ఆమెకు కోపం అప్పుడే తగ్గుతుందా మరి.

  • Loading...

More Telugu News