: బీజేపీ బలోపేతానికి కార్యకర్తగా పనిచేస్తా: కన్నా


భారతీయ జనతా పార్టీ బలోపేతానికి పార్టీ కార్యకర్తగా పనిచేస్తానని కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. అధికారం కోసమే పార్టీ మారానని అనుకోవడం తప్పని, అలా అయితే ఎన్నికల ముందే చాలా అవకాశాలు వచ్చాయని అన్నారు. అయితే, వాటిని సున్నితంగా తిరస్కరించానని తెలిపారు. విజయవాడలో బీజేపీలో చేరిన సందర్భంగా ఆ పార్టీ నేత కన్నా మీడియాతో మాట్లాడారు. త్వరలో పార్టీ అగ్రనేతలతో గుంటూరులో సభ పెడతామని చెప్పారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు బలహీనపడినందునే అందరూ బీజేపీ వైపు చూస్తున్నారని ఎంపీ కంభంపాటి హరిబాబు అన్నారు. మోదీని, బీజేపీని వ్యతిరేకించిన పార్టీలు తమకు ప్రత్యర్థులేనని ఆయన చెప్పారు. టీడీపీ, బీజేపీ రెండూ కలసి పనిచేస్తాయని, రాజధానికి ప్రైవేటు భూములను సేకరించాల్సి ఉంటుందని తెలిపారు.

  • Loading...

More Telugu News