: మహిళా టూరిస్టుల బెలూన్ సరదా అజ్మీర్ జైల్లో కలకలం రేపింది!


వెస్టిండీస్ దీవులకు చెందిన ఇద్దరు మహిళలు భారత్ పర్యటనకు వచ్చారు. పలు ప్రాంతాలను సందర్శిస్తూ, రాజస్థాన్ చేరుకున్నారు. మంగళవారం నాడు అజ్మీర్ లోని పుష్కర్ లో ఓ హాట్ ఎయిర్ బెలూన్ ఎక్కి సరదాగా విహరిద్దామని నిర్ణయించుకున్నారు ఆ టూరిస్టులు. అనుకున్నదే తడవుగా ఓ బెలూన్ లో బయల్దేరారు. వారితో పాటు బెలూన్ ఆపరేటర్ కూడా ఉన్నాడు. అయితే, పైకి వెళ్లేకొద్దీ బలమైన గాలులు వీయడంతో బెలూన్ అదుపుతప్పింది. చివరికి, ఆ గాలుల ధాటికి బెలూన్ కాస్తా అజ్మీర్ జైల్లో ల్యాండైంది. అప్పుడు ఖైదీలందరూ వారి వారి బ్యారక్ లలో ఉన్నారు. జైలు ప్రాంగణంలోకి బెలూన్ ప్రవేశించడంతో ఒక్కసారిగా కలకలం మొదలైంది. వెంటనే స్పందించిన అధికారులు ఆ ఇద్దరు మహిళా పర్యాటకులను అదుపులోకి తీసుకుని గంటకు పైగా ప్రశ్నించారు. అనుమానించదగ్గ వ్యక్తులు కారని తెలుసుకుని వారిని వదిలేశారు. అయితే, బెలూన్ ఆపరేటర్ పై చర్యలు తీసుకున్నారు. అనుమతి లేకుండా ప్రవేశించాడంటూ కేసు నమోదు చేశారు. అటు, నగర పాలక అధికారులు అతని బెలూన్ ఆపరేటింగ్ లైసెన్సును రద్దు చేశారు.

  • Loading...

More Telugu News