: మోదీ గురించి పలు విషయాలను వెల్లడించిన రాజ్ దీప్ సర్దేశాయ్
ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన పలు విషయాలపై ప్రముఖ జర్నలిస్టు రాజ్ దీప్ సర్దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందిరాగాంధీకి, నరేంద్ర మోదీకి పెద్దగా తేడా ఏమీ లేదని... వారిద్దరూ వ్యవస్థ కన్నా, వ్యక్తే అధికుడు అనే రీతిలో వ్యవహరిస్తారని అన్నారు. అమిత్ షాను, అరుణ్ జైట్లీని అమితంగా విశ్వసించే మోదీ... సుష్మా స్వరాజ్ ను మాత్రం నమ్మరని స్పష్టం చేశారు. సుష్మకు పోటీగానే స్మృతి ఇరానీకి మంత్రి పదవి ఇచ్చారని చెప్పారు. గతంలో తనను ఒక కేంద్ర మంత్రి ఇంటికి ఆహ్వానించారని, అయితే వెనుక దారి గుండా రావాలని కోరారని... అంతేకాకుండా, హాలులో కాకుండా వెనకున్న తోటలో కూర్చుందామని చెప్పారని వెల్లడించారు. బంగళాలో ఏ గదిలో ఏ నిఘా వ్యవస్థ ఉందో తనకే తెలియదని చెప్పినట్టు తెలిపారు. మంత్రివర్గ సహచరులకు మోదీ అంటే చచ్చేంత భయమని సర్దేశాయ్ చెప్పారు.