: నేడే బీజేపీలోకి కన్నా చేరిక!


కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ నేడు బీజేపీలో చేరనున్నారు. పార్టీ ఏపీ శాఖ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు సమక్షంలో కన్నా బీజేపీ కండువా కప్పుకోనున్నారు. ఇప్పటికే పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో తో భేటీ అయిన కన్నా, ఆ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ తో కలిసి అమిత్ షాను కలిసిన కన్నా, రాష్ట్ర రాజకీయాలను నివ్వెరపరిచారు. తాజాగా బుధవారం 10.30 గంటలకు తన మద్దతుదారులతో కలిసి కన్నా, అధికారికంగా బీజేపీలో చేరనున్నారు. దీంతో నేటి నుంచి కన్నాను కాంగ్రెస్ నేతగా కాక బీజేపీ నేతగా పరిగణించాల్సి ఉంటుంది.

  • Loading...

More Telugu News