: నేటి నుంచే హైదరాబాద్ వన్డే టికెట్ల అమ్మకం...ధరలు రూ. 300 నుంచి రూ. 7 వేలు


భారత్, శ్రీలంకల మధ్య ఉప్పల్ స్టేడియంలో జరగనున్న మూడో వన్డేకు టికెట్ల అమ్మకాలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. టెకెట్ ధరలు రూ. 300 నుంచి రూ. 7 వేల వరకు ఉంటాయని హెచ్ సీఏ అధ్యక్షుడు అర్షద్ అయూబ్ తెలిపారు. మొత్తం 22,624 టికెట్లను అందుబాటులో ఉంచామని వెల్లడించారు. ఉప్పల్ స్టేడియం, జింఖానా గ్రౌండ్స్ లలో టికెట్ కౌంటర్లను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా, 'బుక్ మై షో' వెబ్ సైట్లోను అమ్మకాలు జరగనున్నాయి. ఉదయం 11 గంటల నుంచి టికెట్ల అమ్మకాలు ప్రారంభమవుతాయి. మ్యాచ్ జరిగే రోజు (ఆదివారం) హబ్సిగూడలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేస్తామని అయూబ్ తెలిపారు. మ్యాచ్ వీక్షించే వారికి మంచినీటిని ఉచితంగా అందిస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News