: ఇంటర్నెట్ వినియోగంలో హైదరాబాద్ కు ఆరో స్థానం!
దేశంలో ఇంటర్నెట్ ను అత్యధిక మంది వినియోగిస్తున్న నగరాల్లో హైదరాబాద్ కు ఆరో స్థానం దక్కంది. ఈ విషయంలో దేశ వాణిజ్య రాజధాని ముంబై తొలిస్థానంలో నిలిచింది. దేశం మొత్తం మీద ఇంటర్నెట్ ను వినియోగిస్తున్న వారి సంఖ్య 24.3 కోట్లుగా ఉంది. వీరిలో 1.64 కోట్ల మంది ముంబై వాసులేనట. గతేడాది ముంబైలో 1.2 కోట్ల మంది నెటిజన్లుండగా, ఏడాది వ్యవధిలోనే కొత్తగా 40 లక్షల మంది నెటిజన్లుగా మారారు. ఇక దేశ రాజధాని ఢిల్లీ ఈ విషయంలో రెండో స్థానంలో ఉందని ఐఏఎంఏఐ సంస్థ అధ్యయనం తెలిపింది. ఇదిలా ఉంటే, మొత్తం వినియోగదారుల్లో 23 శాతం మంది నెటిజన్లు నాలుగు ప్రధాన నగరాల్లోనే ఉండటం గమనార్హం.