: నేడు చిత్తూరు జిల్లా జన్మభూమిలో చంద్రబాబు
చిత్తూరు జిల్లాలో నేడు జరగనున్న జన్మభూమి కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పాల్గొననున్నారు. చిత్తూరు జిల్లా పర్యటనకు వెళుతున్న చంద్రబాబు, జిల్లాలోని కురబలకోట మండలంలో జరగనున్న జన్మభూమి కార్యక్రమంలో పాల్గొంటారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో జిల్లాలోని చిత్తూరు, మదనపల్లి డివిజన్లలోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. చంద్రబాబు పర్యటనకు జిల్లా అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.