: ఎంఐఎం హయాంలో ఉగ్రవాదుల అడ్డాగా హైదరాబాద్: కిషన్ రెడ్డి
మజ్లిస్ (ఎంఐఎం)తో టీఆర్ఎస్ స్నేహం చేయడంపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మండిపడ్డారు. మజ్లిస్ హయాంలో గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ అధ్వానంగా మారిందని... ఉగ్రవాదులకు అడ్డాగా నిలిచిందని అన్నారు. దేశంలో ఏ ప్రాంతంలో ఉగ్రవాది దొరికినా, పట్టుబడిన వారి మూలాలు హైదరాబాదులో ఉంటున్నాయని గుర్తు చేశారు. ఇస్లామిక్ ఉగ్రవాదుల కార్యకలాపాలకు, రిక్రూట్ మెంట్లకు హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్ గా మారిందని మండిపడ్డారు. రానున్న గ్రేటర్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు టీఆర్ఎస్ పార్టీ ఎంఐఎంను మచ్చిక చేసుకుంటోందని ఆరోపించారు. రేషన్ కార్డుల విషయంలో హైదరాబాదులో ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా చూస్తూ ఊరుకోమని కేసీఆర్ సర్కారును కిషన్ రెడ్డి హెచ్చరించారు.