: అసెంబ్లీకి ర్యాలీగా వెళ్లనున్న టీటీడీపీ ఎమ్మెల్యేలు


ఈరోజు నుంచి తెలంగాణ రాష్ట్ర తొలి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాలకు టీటీడీపీ ఎమ్మెల్యేలు ర్యాలీగా బయలుదేరి వెళ్లనున్నారు. తొలుత వీరంతా ఎన్టీఆర్ ఘాట్ లో తారక రామారావుకు నివాళి అర్పిస్తారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి, గన్ పార్కులో అమరవీరుల స్థూపానికి నివాళి అర్పించి, అసెంబ్లీలోకి వెళతారు. బడ్జెట్ సమావేశాలలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి ప్రణాళికలు రచించామని టీటీడీపీ నేతలు చెప్పారు.

  • Loading...

More Telugu News