: కోల్ కతా జాగ్రత్త... ఉగ్రవాదుల కన్నుపడింది: ఇంటెలిజెన్స్ బ్యూరో


కోల్ కతా విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరించింది. ఉగ్రవాద దాడులు జరిగే ప్రమాదం ఉందని భావించిన ఇంటెలిజెన్స్ బ్యూరో కోల్ కతా పోలీసులను అప్రమత్తం చేసింది. కోల్ కతా షిప్ యార్డుపై ఉగ్రవాదులు దృష్టి సారించినట్టు ఐబీ భావిస్తోంది. ఈ హెచ్చరికల నేపథ్యంలో నావికాదళ ప్రదర్శన నిలిపేశారు. దేశంలోని అత్యధిక జనాభా కలిగిన నగరంగా కోల్ కతాకు పేరు. అలాంటి కోల్ కతాలో విధ్వంసం సృష్టిస్తే భారీ నష్టం జరిగే అవకాశం ఉందని ఉగ్రవాద సంస్థల ఆలోచనలు పసిగట్టిన ఐబీ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది.

  • Loading...

More Telugu News