: కేసీఆర్, బాబు ప్రతి విషయాన్ని వివాదం చేస్తున్నారు: జగన్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బాబు ప్రతి విషయాన్ని వివాదాస్పదం చేస్తున్నారని వైఎస్సార్సీపీ అధినేత జగన్ మండిపడ్డారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ప్రతి విషయంలో కీచులాడుకుంటూ ముఖ్యమంత్రులిద్దరూ ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. ప్రజాసంక్షేమాన్ని చూడాల్సిన బాధ్యత ఇద్దరు ముఖ్యమంత్రులపై ఉందని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ నీటి కోసం మానవత్వంతో ఆలోచిస్తే, బాబు విద్యుత్ పై మానవత్వంతో ఆలోచించాలని ఆయన సూచించారు. పరస్పరం సహకరించుకోవడం మానేసి పరనింద, ఆత్మస్తుతిలా వ్యవహరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.