: హాస్య బ్రహ్మ జంధ్యాలకి గౌరవ డాక్టరేట్
నవ్వడం భోగం, నవ్వించడం ఓ యోగం, నవ్వకపోవడం ఓ రోగం అంటూ తెలుగు సినిమాలకు హాస్యాన్ని అద్ది, సినీ జగత్తును రసరంజకం చేసిన హాస్య బ్రహ్మ జంధ్యాల కాలం చేసి ఇన్నేళ్లయినా ఆయన స్మృతులు తెలుగు ప్రజలపై చెరగని ముద్రవేశాయి. ఈ దిగ్గజ దర్శక రచయితకు ఐక్యరాజ్యసమితిచే గుర్తింపు పొందిన అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ యూఎస్ఏ స్వస్త ఎన్విరాన్ మెంట్, హ్యమన్ రైట్స్ ఫౌండేషన్ మరణానంతరం గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. నవంబర్ 1న గౌరవ డాక్టరేట్ ను జంధ్యాల సతీమణి అన్నపూర్ణ స్వీకరించారు. జంధ్యాల దివంగతులైన 14 ఏళ్ల తరువాత ఈ గౌరవ డాక్టరేట్ దక్కడం విశేషం.