: మంత్రిగారికి 67... ఆయన మనువాడిన వధువుకు 29!
చింతచచ్చినా పులుపు చావలేదనడానికి ఈ బంగ్లాదేశ్ మంత్రివర్యుడే నిదర్శనం. వార్ధక్యంలో అడుగుపెట్టిన ఆయన కొత్త పెళ్లికొడుకయ్యారు. ఓ రకంగా, ప్రస్తుత సగటు జీవితకాల గణాంకాల ప్రకారం కాటికి కాళ్లు చాపుకున్న వయసులో ముజ్బుల్ హక్ (67) పెళ్లికి సిద్ధమయ్యారనొచ్చు. బంగ్లాదేశ్ రైల్వే శాఖ మంత్రిగా పనిచేస్తున్న ముజ్బుల్ హక్ పెళ్లాడిన మహిళ హోనుఫా అఖ్తర్ రిక్తా (29) వయసు అతని వయసులో సగం కూడా లేకపోవడం విస్తుగొలుపుతోంది. బంగ్లాదేశ్లోని కోమిల్లా జిల్లాలో 700 మంది బంధువుల సాక్షిగా జరిగిన ఈ పెళ్లికి ఆయన 4 లక్షల రూపాయల కన్యాశుల్కం కూడా చెల్లించారు. అనంతరం నూతన పెళ్లికొడుకైన వృద్ధనేత గేటులోంచి పెళ్లి వేదిక వద్దకు వెళ్లడానికి తన మరదళ్లకు లక్ష టాకాలు కూడా సమర్పించుకున్నారు.