: ఛాపెల్ బెదిరింపులపై గొంతు విప్పిన భజ్జీ, జహీర్
టీమిండియా మాజీ కోచ్ గ్రెగ్ ఛాపెల్ పై సచిన్ టెండూల్కర్ తన ఆత్మకథలో తెలిపిన విషయాలకు మద్దతుగా మరికొందరు క్రికెటర్లు గొంతు విప్పారు. ఇప్పటికే ఛాపెల్ వ్యవహార సరళిపై గంగూలీ వ్యాఖ్యానించగా, తాజాగా, సీనియర్ క్రికెటర్లు హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్ కూడా ఆరోపణలు చేశారు. కోచ్ గా ఛాపెల్ తన పరిమితులను అతిక్రమించాడని భజ్జీ పేర్కొన్నాడు. జహీర్ మాట్లాడుతూ, తాను కోచ్ గా ఉండగా ఎలా ఆడతావో చూస్తానంటూ ఛాపెల్ తనను బెదిరించాడని తెలిపాడు.