: లక్ష ఇవ్వండి, మూడు లక్షలు పట్టుకెళ్లండి...18 లక్షలకే కేజీ బంగారం... నిండా ముంచేశారు


లక్ష రూపాయలు డిపాజిట్ చేయండి, 3 లక్షల రూపాయలు తీసుకెళ్లండి... కేజీ బంగారం కేవలం 18 లక్షల రూపాయలే అంటూ జనాన్ని నిలువునా ముంచుతున్న చీటింగ్ ముఠా గుట్టు రట్టు చేశారు పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పోలీసులు. ఈ ముఠాకు చెందిన ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి భారీగా నకిలీ బంగారం, పెద్దఎత్తున నకిలీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. ఈ మధ్య కాలంలో ఉభయగోదావరి జిల్లాల్లో తక్కువ నగదు ఇస్తే అధికమొత్తం ఇస్తామనీ, 'కొంత మొత్తం డిపాజిట్ చేయండి బంగారం తీసుకెళ్లండి' అంటూ బంపర్ ఆఫర్లు ఇస్తూ అందినకాడికి దండుకుంటున్నారు మాయగాళ్లు. తక్కువ మొత్తానికి అధిక మొత్తం అనేసరికి వారి వలలో అమాయకజనాలు సులువుగా పడిపోతున్నారు. దీంతో అలాంటి ఆఫర్లు అమలు చేస్తున్న వారిపై నిఘా ఉంచారు పోలీసులు. ఈ నేపథ్యంలో అంతుచిక్కని ఆఫర్లతో జనాలను ముంచుతున్న ఓ ముఠాను పట్టుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News