: ఢిల్లీ అసెంబ్లీ రద్దుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం
ఢిల్లీ అసెంబ్లీ రద్దుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ప్రధాని నివాసంలో కాసేపటి క్రితం సమావేశమైన మంత్రివర్గం... ఢిల్లీ శాసనసభను రద్దు చేయాలంటూ లెఫ్టినెంట్ గవర్నర్ సమర్పించిన నివేదికకు ఆమోదం తెలిపింది. దీంతో, త్వరలోనే ఢిల్లీ అసెంబ్లీకి మళ్లీ ఎన్నికలు జరగనున్నాయి.