: భారత్ పైకి తీవ్రవాదులను పాక్ తన ప్రతినిధులుగా ఉపయోగిస్తోంది: 'పెంటగాన్' రిపోర్ట్
సరిహద్దు వద్ద భారత సైన్యాన్ని ఎదుర్కొనేందుకు తీవ్రవాదులను తమ ప్రతినిధులుగా పాకిస్థాన్ ఉపయోగించుకుంటోందని అమెరికా రక్షణ వ్యవహారాల శాఖ 'పెంటగాన్' పేర్కొంది. ఈ మేరకు ఆరు నెలలకు రూపొందించిన కొత్త నివేదికను అమెరికా పార్లమెంటుకు సమర్పించింది. "పాకిస్తాన్ భూభాగం నుంచి ఆఫ్ఘనిస్తాన్ కు నష్టం కలిగించే విధంగా, ప్రాంతీయ స్థిరత్వం కోసం ఆఫ్ఘన్-భారత్ పై తీవ్రవాదులు తమ కార్యకలాపాలు సాగించేందుకు దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో ఆఫ్గనిస్తాన్ లో ప్రభావం కోల్పోవడంతో, ఈ తీవ్రవాద దళాలను భారత సైన్యం మీదకు పాక్ ఉసిగొల్పుతోంది" అని ఆఫ్ఘన్ లోని ప్రస్తుత పరిస్థితిని పెంటగాన్ వివరించింది. ఈ సంబంధాలు పాక్ ప్రభుత్వ నిబద్ధతకు విరుద్ధంగా అమలవుతూ ఆఫ్ఘన్ నేతృత్వంలోని స్నేహానికి మద్దతు పలుకుతున్నాయని పేర్కొంది. అదే నివేదికలో మేలో హెరాత్ ప్రావిన్స్ లోని ఇండియన్ కాన్సులేట్ పై నలుగురు తీవ్రవాదుల చేసిన దాడిని కూడా పెంటగాన్ ప్రస్తావించింది. భారత ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ ప్రమాణస్వీకారానికి మూడు రోజుల ముందుగా ఇలా జరిగిందని తెలిపింది. ఎందుకంటే, హిందూమత జాతీయవాద గ్రూపులకు మోదీ పూర్తి మద్దతుగా ఉంటారని గ్రహించి ఆ దాడి చేసినట్టు వివరించింది.